KTR : ముంచుకొస్తున్న భారీ ముప్పు.. కేటీఆర్ ట్వీట్

KTR : ముంచుకొస్తున్న భారీ ముప్పు.. కేటీఆర్ ట్వీట్
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్అయ్యారు. 'బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అక్షర సత్యమని తేలిపోయింది. ఇప్పటికే రెండు బొగ్గు బ్లాక్లులను ప్రైవేటుపరం చేసి, ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టడం, ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక. తొలితరం ప్రభుత్వరంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీ ర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలు కార్మికుల హక్కులకు మరణశాసనాలే. లాభాల పంట పండించి దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో మూలస్తంభంలా నిలిచినందుకు సింగరేణి సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్.. ప్రైవేటైజేషనేనా? తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తం. కార్మికుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చవిచూపిస్తం' అని వార్నింగ్ ఇచ్చారు.

ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిండ్రు ఓయూలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేయడమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీలను అట కెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీ కి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టిందని మండిపపడ్డారు. నిరసన తెలిపే హక్కును కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. 'ఇది ఎమ ర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన ఘటన సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. అలాంటి దారుణాలు రిపీట్ కాకుండా చూడా ల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయం. నిర్బంధ పాలనతో గొంతునొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితు ల్లో సహించే ప్రసక్తే లేదు. నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు' అంటూ ట్వీట్ చేశారు.

Tags

Next Story