TG : భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు

TG : భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు
X

భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు పై అసంతృప్తి వ్యక్తం చేశారు పొదెం వీరయ్య. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు.. వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడని అన్నారు. ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం కలుగుతుందని చెప్పారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డానని, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తానని పొదెం వీరయ్య వెల్లడించారు. గతంలో ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన పొదెం వీరయ్య మొదటి నుంచి కాంగ్రెస్ వాది. ఎప్పుడూ పార్టీ మాత్రం ఫిరాయించ లేదు. అయితే.. అప్పట్లో ములుగు సీటు సీతక్కకు సీటు ఇవ్వాల్సి వచ్చినందున పొదెంను భద్రాచలంకు షిఫ్ట్‌ చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. అయిష్టంగానే పది రోజుల ముందు వచ్చి ప్రచారం చేసినా… నాడు తొలిసారి భద్రాచలంలో పాగా వేయగలిగారు. మంచి వాడు, అందరి వాడన్న పేరుంది. కానీ.. 2023 ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది.

Tags

Next Story