రామగుండం మేయర్‌కు వార్నింగ్ లెటర్

X
By - Bhoopathi |18 Jun 2023 12:15 PM IST
రామగుండం మేయర్‌కు వార్నింగ్ లెటర్ ఇచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు.
రామగుండం మేయర్‌కు వార్నింగ్ లెటర్ ఇచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయన ఇంట్లో పనిమనిషికి ఈ లెటర్ ను ఇచ్చారు దుండుగులు. గోదావరిఖని మార్కేండేయ కాలనీలోని మేయర్ ఇంటికి వచ్చిన దుండగులు ముఖ్యమైన లెటర్ మేయర్‌కు ఇవ్వాలంటూ పనిమనిషికి ఇచ్చారు. ఈ లెటర్ చదవి నేరుగా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు మేయర్. రంగంలో దిగిన పోలీసులు మేయర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మేయర్‌కు అగంతకులు బెదిరింపు లేఖ ఇవ్వడం సంచలనంగా మారింది.మేయర్ వ్యతిరేక వర్గం ఈ పనికి పాల్పడిందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు పోలీసులు.అయితే ఈ లేఖలో ఏముందన్నది పోలీసులు చెప్పడం లేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com