Aarogyasri Scheme : ఆరోగ్య మిత్రల సమ్మె బాట

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద విధులు నిర్వహి స్తున్న ఆరోగ్యమిత్రలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో సమ్మె బాట పట్టారు. బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఆరోగ్య మిత్ర ఉద్యోగుల సంఘం ప్రకటించింది. సమ్మె, నిరసనల్లో భాగంగా బుధవారం ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్టడించాలని ఆరోగ్య మిత్రలు నిర్ణయించారు.
సమ్మె విషయమై ఇప్పటికే ఆరోగ్య మిత్రల సంఘం ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అయితే సర్కారు నుంచి సానుకూల స్పందన రాలేదని ఆరోగ్య మిత్రలు ఆరోపిస్తున్నారు. అయితే గతంలోనే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినా రాష్ట్రంలో వరదల కారణంగా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పటికే పలు రూపాల్లో ఆరోగ్య మిత్రలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకపాత్ర పోసిస్తున్నా మని అయినా తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోగ్య మిత్రలు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్యమిత్రలకు డేటాప్రాసెసింగ్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించడం తోపా టు నెలసరి వేతనం రూ.23 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com