TG : అందరికీ ఆరోగ్యశ్రీ.. రేషన్ కార్డుతో లింక్ లేదు

ప్రజారోగ్య పరిపక్షణకు ప్రథమ ప్రాధా న్యత ఇవ్వాలని, రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టకుండా పథకాన్ని అమ లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) జిల్లా కలెక్టర్లకు స్పష్ట మైన ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం జరిగిన సమావేశంలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకం అమలుపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు.
కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నా.. వారందరికీ తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను అందజేయాలన్నారు. సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉండేలా చర్యలు మొదలు పెట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నెలల వ్యవధిలోనే తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసు కోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉండడం ద్వారా అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు.
సవాలుగా మారుతున్న ఆరోగ్య ప్రపంచంలో వ్యాధులు సంక్రమించినపుడు పేద వర్గాల్లో భయం, ఆందోళన పెరుగుతున్న సందర్భాలు అనేకంగా ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన న్యాయం జరిగేలా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com