ACB Raids : హాస్టల్స్‌లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాల్లో ఈ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఏసీబీ అధికారులు హాస్టల్స్ కు చేరుకుని సోదాలు చేస్తున్నారు. వసతి గృహాల్లో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు? రికార్డుల్లో ఎంత మంది వివరాలు ఉన్నాయి? ఆహార నాణ్యత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు.
రికార్డులు పరిశీలిస్తూ విద్యా ర్థులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఈ తనిఖీలు కొనసాగే చాన్సుంది. హాస్టల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని, తప్పుడు బిల్లులతో విద్యార్థులకు అందించాల్సినవి పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఈ రెయిడ్స్ చేపట్టినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com