ACB Investigation KTR : 9న ఏసీబీ విచారణ.. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

ACB Investigation KTR : 9న ఏసీబీ విచారణ.. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
X

ఫార్ములా-ఈ రేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ దాఖలు చేసింది. సాయంత్రానికి కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. మంగళవారం కేటీఆర్ తరఫున అడ్వొకేట్ మోహిత్ రావు ఈ పిటిషన్ ను ఫైల్ చేశారు. ఏసీబీ దాఖలు చేసిన కేసు పూర్వాపరాలు, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఈ పిటిషను జత చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ కూడా తన ఎఫ్ఎస్ఐఆర్ పేర్కొనలేదన్నారు. అందువల్ల ఏసీబీ సెక్షన్లు కేటీఆర్కు వర్తించవన్నారు. ఈ ఎఫ్ఎస్ఐఆర్ ను కొట్టేయాలని కోరారు. దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

ఈ కేసులో కేటీఆర్ కన్నా ముందుగానే మంగళవారం తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం అందులో సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు కూడా ముగిసింది. ఇప్పుడు ఆ అంశం సుప్రీం కోర్టుకు చేరడంతో పిటిషనర్ తో పాటుగా ప్రభుత్వం తరపున వాదనలు విన్న తర్వాతే సుప్రీం తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.

Tags

Next Story