ACB Raids : కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Raids : కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు
X

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ విషయంలో అటు ఏసీబీ కూడా దూకుడు పెంచింది. మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. శేరిలింగంపల్లిలోని గోపన్‌పల్లిలో ఉన్న క్రిస్టన్ విల్లాలో ఆయన నివాసంలో ఏకకాలంలో రెండు బృందాలు సోదాల్లో చేస్తున్నాయి. పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను చెక్ చేస్తున్నారు.

ప్రస్తుతం మురళీధర్ రావు న రిటైర్డ్ అయినా, కాళేశ్వరం ఈఎన్‌సీగా బాధ్యలు నిర్వర్తించిన కాలంలో అనేక కీలక పనులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కళాశాల స్థాపనలతో పాటు ప్రాజెక్ట్ నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తం కావడంతో, అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మిగిలిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై కూడా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులను ఏసీబీ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసింది.

Tags

Next Story