TG : విద్యుత్ ఉద్యోగుల కొరకు ప్రమాద బీమా పాలసీ

TG : విద్యుత్ ఉద్యోగుల కొరకు ప్రమాద బీమా పాలసీ
X

విద్యుత్ కార్మికులకు కోటి రూ పాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఉదయం ప్ర జాభవన్ లో ఎన్ పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పో యిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేశ్ సతీమణికి కారుణ్య నియామక ఉత్తర్వులను డిప్యూటీ సీఎం అంద జేశారు. సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగిం చారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిర మ్మ ప్రభుత్వంలోని సాధ్యం అయిందన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదని తమ ప్రభుత్వం వచ్చాకే ఇది సాధ్యం అయిం దన్నారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతోందని చెప్పారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశ పెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచర ణలోకి తీసుకువచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కోటి రూపాయల పైబడి ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మి కుల అందరిలో ఓ కొత్త భరోసా నింపుతుంది అన్నారు. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. కార్యక్రమంలో ఎన్పీ డీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారు వేం నరేందర్ రెడ్డి విద్యుత్తు, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story