Accident : 44వ జాతీయ రహదారిపై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్

Accident : 44వ జాతీయ రహదారిపై ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
X

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి 44వ జాతీయ రహదారిపై కారు, డీసీఎం ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని హుటా హుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడి రోడ్డు అవతలి వైపు దూసుకెళ్లింది. దీంతో హైదరాబాద్ వైపు నుంచి జడ్చర్ల వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన డీసీఎం వాహనాన్ని ప్రత్యేక క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Tags

Next Story