Allu Arjun : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులు అరెస్ట్.. బెయిల్

Allu Arjun : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులు అరెస్ట్.. బెయిల్
X

సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆరుగురు నిందితులను గుర్తించి పీఎస్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్, నాగరాజు, నగేశ్ ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై ఎటాక్ చేసింది ఓయూ జేఏసీ. ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా మాట్లాడటంపై నిరసన వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు జేఏసీ నేతలు. అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఇంటి ముందు ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

Tags

Next Story