TG : ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యమంత్రి ప్రతాప్ జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో 14 ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజనర్సింహ తెలిపారు. మెడిసిన్స్ పంపిణీకి 2,600 మంది సిబ్బందికి శిక్షణను ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామని తెలిపారు. అదేవిధంగా 2522 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు క్షేత్రస్థాయిలో సేవలందిస్తారని వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
