ACB Raids : ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్.. భారీగా అక్రమ సంపాదన

రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని ముత్యంరెడ్డి అనే వ్యక్తి కోరడంతో రూ. 8 లక్షల డిమాండ్ చేశారు. దీంతో ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పక్కా ప్లాన్ తో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి రూ.8 లక్షల నగదును ముత్యంరెడ్డి నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్న ఏసీబీ అధికారులకు చెప్పాడు. తమ ముందే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయాలంటూ అధికారులు ఆదేశించడంతో.. అలాగే చేశాడు. పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ' జాయింట్ కలెక్టర్ చెప్పాడు. పెద్దఅంబర్ పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తన అధికారిక వాహనంలో వచ్చి మధుమోహన్రెడ్డి నుంచి రూ. 8 లక్షలు తీసుకుం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేశారు.
గత రాత్రి నుంచే అంబర్పేట మున్సిపాలిటీ తట్టి అన్నారం ఇందుఅరణ్య అపార్ట్ మెంట్ లో భూపాల్రెడ్డి నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ. 16 లక్షల నగదు, పెద్ద ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com