Revanth Reddy : ఘనంగా అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకలు.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

Revanth Reddy : ఘనంగా అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకలు.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
X

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బంజారా హిల్స్ రోడ్ నెం.12లో ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అగ్రసేన్ జయంతి వేడుకలను రంగుల ఊరేగింపులు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా జరుపుకుంటున్నారని సీఎం అన్నారు.

దైవ నాయకుడు, వైశ్య సమాజ్ ఆదర్శమూర్తి అయిన అగ్రసేన్ మహారాజ్ సిద్ధాంతాలు, ఆయన చేసిన సేవలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags

Next Story