Bhatti Vikramarka : వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం : భట్టి విక్రమార్క

ప్రజాప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ సారి బడ్జెట్ లో రూ. 72 వేల కోట్లను కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కా రాల అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన మా ట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లు కాళేశ్వరంతోనే వరి ఉత్పత్తి పెరిగిందని చెప్పిన మాటలు అవాస్తవమని తేలిపోయిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకున్నావరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం లో నిలిచిందన్నారు. ఆనాటి కాంగ్రెస్ పాలకుల ముందు చూపుతో నిర్మాణం చేసిన బహుళార్థ సాధక ప్రాజెక్టుల వల్లనే ఈ సంవత్సరం వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నా రు. వ్యవసాయం చేసే వాళ్ళు పెరగాలని భూ సంస్కరణల చట్టం తీసుకువచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న భూమిని లక్షల మంది రైతులకు పంపిణీ చేసిన మహనీయురాలు ఇందిర అన్నారు. ప్రపంచంలో అనేక దేశాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి చేసే విధంగా పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని చేర్చిన ముందు చూపు ఉన్న దార్శనీకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. తెలంగాణలో కృష్ణా నదిపైనా గార్జునసాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు, గోదావరి నదిపై ఎస్సార్ఎస్పీ దేవాదుల, శ్రీపాద ఎల్లంప ల్లి, ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు ఆనాటి కాంగ్రెస్ పాలకులు వేసిన పునాదుల వల్లనే లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. స్వా తంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా కేవలం 15 రోజుల్లో రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు ఒకేసారి మాఫీ చేశామని, 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశామని భట్టి చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు పంట నష్టం పరిహారం ఇవ్వలేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరదల బీభత్సం వల్ల జరిగిన పంట నష్టాన్ని అధికారు లతో అంచనా వేయించి పరిహారం ఇస్తున్నామ న్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తు న్నామని వివరించారు. ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తోందని చెప్పారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com