Hydra : హైడ్రాకు మజ్లిస్ ఎమ్మెల్యేల వార్నింగ్

Hydra : హైడ్రాకు మజ్లిస్ ఎమ్మెల్యేల వార్నింగ్

ఎంఐఎం ఎమ్మెల్యేలు హైడ్రాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాతబస్తీకి బుల్డోజర్లు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. పేదల ఇళ్లు కూల్చే ముందు తమపైకి బుల్డోజర్లను ఎక్కించాలన్నారు. మరోవైపు బహదూర్‌పురా మండల రెవెన్యూ కార్యాలయం వద్ద హైడ్రాకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో నలుగురు AIMIM కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రా కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు ధర్నాలో పాల్గొన్నారు. హైడ్రా హటావో, ఘర్ బచావో, 'సీఎం డౌన్ డౌన్' అంటూ నాయకులు, ప్రజలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన కార్పొరేటర్లను ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు

Tags

Next Story