Rain Alert : అలెర్ట్.. తెలంగాణలో మరో రెండు రోజులు వానలు

తెలంగాణలోని పలు జిల్లాలలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపు లతో గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. ఆగ్నేయ దిశలో ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు, అదే విధంగా విదర్భ నుండి దక్షిణ చత్తీస్ గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ఫలితంగా ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశం కర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూ డెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పెరిగిన నీటి మట్టం భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో హైద రాబాద్ జలాశయాల్లో నీటి మట్టం పెరిగింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలను తలిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 513.41 మీటర్లు కాగా.. 513.24 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. 1081 క్యూసెక్కుల ఇనో వస్తుండటంతో.. 1081 క్యూసెక్కుల ఇన్ వస్తుండటంతో.. హుస్సేన్నాగర్ నుంచి దిగువకు 789 క్యూసె క్కుల నీరు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1761.05 అడు గులకు నీటి మట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 300 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతుంది. ఇక ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ఎగువ నుంచి 100 క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్ర స్తుతం 1782.80 అడుగులకు చేరుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com