TRS Plenary 2021: అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు..

TRS Plenary 2021 (tv5news.in)
TRS Plenary 2021: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీకు సర్వం సిద్ధమైంది. మూడేళ్ల విరామ తర్వాత జరుగుతున్న ఈ ప్లీనరీకి పా ఘనంగా ఏర్పాట్లు చేశారు టీఆర్‌ఎస్ నేతలు. 15 వేల మంది హాజరువుతున్న ఈ ప్లీనర్లీకి అంచనాకు తగ్గట్లు సదుపాయాలు సమకూర్చారు. కోట ద్వారాన్ని తలపించేలా 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులు ఇలా దాదాపు 15 వేల మంది వస్తారని అంచనా వేశారు. ఇందుకు తగ్గట్టుగా సదుపాయాలు సమకూర్చారు. ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా ప్లీనరీ సమావేశం వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానే భుజాన వేసుకుని పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ మొదలు, సభా వేదిక దాకా అన్నింటిని మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఆకర్షిస్తున్నాయి.
పలు కూడళ్లలో సీఎం కేసీఆర్ ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జంక్షన్లలో తోరణాలతో గ్రేటర్ హైదరాబాద్ అంతా... గులాబీమయమైంది. ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేవారి కోసం 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనంలో 29 రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఆహ్వాన పాసులు అందించడం పూర్తయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com