Minister Komatireddy : పెండింగ్ ప్రాజెక్టులన్నీ స్పీడప్ : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ స్పీడప్ అవుతున్నాయని, ఎస్ఎల్బీసీ పూర్తయితే కృష్ణా అలకేటెడ్ నీటిని గ్రావిటీ ద్వారా తెచ్చుకోవ చ్చు. గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ ప్రాజెక్టును పెండింగ్లో పెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇవాళ జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2005లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇది ప్రపంచంలో నే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్ అన్నారు. 2027 నాటికి దీనిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమక్కుమారెడ్డి చెప్పారన్నారు. నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం అధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతమని, అందుకు ఆ ప్రాంతంలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించా లన్నది లక్షమన్నారు. నెల రోజులుగా రాష్ట్రం అంత వర్షం కురిసినా నల్లగొండ జిల్లా కట్టం గూరు, మునుగోడు, నార్కట్ పల్లిలో వర్షాలు అతి తక్కువ పడ్డాయన్నారు. అందుకే ఆయా ప్రాంతాల్లో తాగు, సాగు నీటి కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు కోసం రూ. 300 కోట్లు కేటాయించాలని కోరారు. సుమారు 3వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com