Allu Arjun : పోలీసుల ముందు హాజరైన అల్లు అర్జున్

Allu Arjun : పోలీసుల ముందు హాజరైన అల్లు అర్జున్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం జూబ్లిహిల్స్ లోని తన ఇంట్లో భార్య, పిల్లలతో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పి కారెక్కారు అల్లు అర్జున్. తండ్రి, మామలతో కలిసి చిక్కడపల్లిలోని పోలీస్ స్టేషన్ కు ఉదయం 11 గంటల తర్వాత వచ్చారు.

ఇవాళ విచారణకు రావాలని నిన్న సోమవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అల్లు అర్జున్ ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు. 4 వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ ఉంది. దీంతో.. ఇవాళ అల్లు అర్జున్ ను విచారించి పంపిస్తారని టాక్ నడుస్తోంది. అరెస్ట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ప్రిపేరై వచ్చిన అల్లు అర్జున్.. ముఖంలో కాన్ఫిడెన్స్

పోలీసుల నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఈసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ప్రిపేర్డ్ గా వచ్చినట్టు సమాచారం. కోర్టులో 4 వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ ఉండటంతో.. ధైర్యంగా విచారణకు వచ్చినట్టు తెలుస్తోంది. విచారణకు సంబంధించి నిన్న రాత్రే ఆయన తన లీగల్ టీమ్ తో ఇంట్లో ప్రత్యేకంగా ముచ్చటించారు. కేసుకు సంబంధించి ఏం అడుగుతారు.. ఏం చెప్పాలి.. అనే దానిపై ఓ ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.

తన కారవాన్ లో చిక్కడపల్లి పీఎస్ కు వచ్చారు అల్లు అర్జున్. నలుపు రంగు షర్ట్, ప్యాంట్ వేసుకుని వచ్చారు. తన తండ్రి, మామ కూడా వెనకాల పీఎస్ కు మరో కారులో వచ్చారు. ఐతే.. అధికారుల విచారణ కోసం గదిలోకి అల్లు అర్జున్ ఒక్కరినే అనుమతించారు.

Tags

Next Story