DK Aruna : కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలో అల్లు అర్జున్ బలైపోతున్నాడు : డీకే అరుణ

తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఖండిస్తోందన్నారు ఎంపీ డీకే అరుణ. ఇలాంటి దాడులను ఎవరూ సమర్థించరని చెప్పారు. పోలీసు అధికారులు ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారని డీకే అరుణ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చెప్పారు. సీఎం పేరు మర్చిపోయానని అల్లు అర్జున్ అనడాన్ని కేటీఆర్ ట్రోల్ చేశారని... అందుకే అల్లు అర్జున్ ని రేవంత్ టార్గెట్ చేశారని విమర్శించారు. అల్లు అర్జున్ ని బలిపశువు చేశారని డీకే అరుణ అన్నారు. రేవంత్ కు, కేటీఆర్ కు మధ్య ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపవద్దని అన్నారు. ఓవరాల్ గా రేవంత్ కక్ష వల్ల సినిమా ఇండస్ట్రీ బలైపోతుందని చెప్పారు డీకే అరుణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com