KTR : అటెన్షన్ డైవర్షన్ కోసమే అల్లు అర్జున్ ఇష్యూ.. సీఎంపై కేటీఆర్ ఆగ్రహం

హీరో అల్లు అర్జున్, పుష్ప సినిమా వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యల పై నుంచి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్ళపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు… ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు మనుషులు కాదన్నట్టు.. సినిమా వాళ్లపై పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని కేటీఆర్ విమర్శించారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.
మరోవైపు.. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక 2025లో నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడుతామని చెప్పారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ ఆవీర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com