Allu Arjun : శ్రీతేజ్ కు అల్లు అర్జున్ ఇచ్చిన హామీ ఇదే

Allu Arjun : శ్రీతేజ్ కు అల్లు అర్జున్ ఇచ్చిన హామీ ఇదే
X

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయ పడిన శ్రీతేజ్ ను పరామర్శించడానికి నటుడు అల్లు అర్జున్ మంగళవారం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు ఏ విధంగా స్పందిస్తున్నాడనే విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రితో కూడా మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటానని, భరోసా కల్పించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సైతం చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తే ముందుగానే సమాచారం ఇవ్వాలంటూ ఇప్పటికే రాంగోపాల్ పేట్ పోలీసులు ఆయనకు తెలియజేశారు. షరతులు పాటించాలని నోటీసుల్లో వెల్లడించారు. ఆ నిబంధనల మేరకు ఆసుపత్రికి చేరుకున్న అల్లు అర్జున్ దాదాపు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలోనే ఉండి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నారు. మొదట శ్రీ తేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లాలనుకున్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి రావద్దని, ఒకవేళ వస్తే అక్కడ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags

Next Story