TG : ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ ఫిర్యాదు

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించనున్న ప్లై ఓవర్ల కారణంగా రోడ్డు వెడల్పు విషయంలో తన ఇంటికి అధికారులు చేసిన మార్కింగ్ సరిగాలేదని.. ఇష్టాను సారం చేశారని ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయానికి కమిషనర్ ఇలంబరితి లేకపోవడంతో అడిషనల్ కమిషనర్ శివ కుమార్ నాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. స్టార్ బక్స్ సమీపంలోని తన ఇంటి వద్ద ప్రస్తుతం నిర్మించతలపెట్టిన ఫ్లైఓవర్ కు రోడ్డు వెడల్పు నిమిత్తం ఒకచోట 20 అడుగులు, మరోచోట 36 అడుగులు మార్క్ చేశారని, తన ఇంటిపక్కనున్న వారికి మాత్రం యధావిధిగా 20 అడుగులకు మార్చేశారని ఫిర్యాదు చేశారు. ఇంత వ్యత్యాసం పక్కపక్క ఇళ్లకు ఎలా వర్తిస్తుందని అడిగారు. ప్రస్తుతం ఆ రోడ్డును ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు అని, ఆ వివరాలు కూడా పరిశీలించాలని కోరారు. అయితే తాము అన్నీ పరిశీలించిన తర్వాతే మార్క్ చేశామని అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆయన ప్రస్తుత ఇల్లు రోడ్ కార్న ర్లో ఉందని... కార్నర్ వైపు ఉంటే ఎక్కువగానే రోడ్డు వెడల్పు చేయాల్సి ఉంటుం దని అంటున్నారు. గతంలో కూడా ఈ విషయంలో వారికి క్లారిటీ ఇచ్చామని చెబు తోన్న అధికారులు... అన్ని పరిశీలించుకోవాలని సూచించినట్లు తెలిసింది. అయితే, ఫిర్యాదును పరిశీలిస్తానని కమిషనర్ ఇలంబరితి మీడియాకు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com