Allu Arjun : కిమ్స్‌లో అల్లు అర్జున్ భావోద్వేగం.. శ్రీతేజ్ కు పరామర్శ

Allu Arjun : కిమ్స్‌లో అల్లు అర్జున్ భావోద్వేగం.. శ్రీతేజ్ కు పరామర్శ
X

సినీ నటుడు, ఐకన్ స్టార్ అల్లు అర్జున్‌ బేగంపేటలోని కిమ్స్‌ హాస్పిటల్ కు వచ్చారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించారు. వెంటిలేటర్‌పై ఉన్న శ్రీతేజ్‌ను చూసి అల్లు అర్జున్‌ భావోద్వేగానికి గురయ్యారు. శ్రీతేజ్ తండ్రిని కలిసి చికిత్స జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని డాక్టర్లు అల్లు అర్జున్ కు తెలిపారు. కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందని అల్లు అర్జున్‌కు వివరించారు. రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని వారి కుటుంబసభ్యులకు అల్లు అర్జున్ ఈ సందర్భంగా భరోసానిచ్చారు. అల్లు అర్జున్ వెంట తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా ఆసుపత్రికి వచ్చారు. అల్లు అర్జున్‌ రాకతో కిమ్స్‌ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Next Story