TG : తెలంగాణలో అంబర్-రెసోజెట్ రూ.250 కోట్ల పెట్టుబడులు

TG : తెలంగాణలో అంబర్-రెసోజెట్ రూ.250 కోట్ల పెట్టుబడులు
X

పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే 'అంబర్-రెసోజెట్' భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. సంస్థకు ప్రభుత్వపరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్లతో పరిశ్రమ నెలకొ ల్పుతుందని చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.త్వరలోనే అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీ)ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.

Tags

Next Story