ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది : అమిత్‌షా

జీహెచ్‌ఎంసీపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. వరదలతో హైదరాబాద్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. వరదలు వచ్చినప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు పర్యటించలేదన్నారు. ఎంఐఎం ఎన్నో అక్రమ కట్టడాను నిర్మించిందని.. బీజేపీని గెలిపిస్తే అక్రమ కట్టడాలను కూల్చేస్తామని అన్నారు అమిత్ షా.
ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమిత్‌షా ఆరోపించారు. టీఆర్‌ఎస్ వంద రోజుల ప్రణాళిక ఏమైందని ప్రశ్నించారు. మూసీ నది వెంట ఒకసారి తిరిగి చూడండి.. ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ నుంచి సచివాలయం వస్తే కదా తెలిసేది అంటూ ఎద్దేవా చేశారు అమిత్ షా.
నిజాం నవాబ్ సంస్కృతి నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పిస్తామన్నారు అమిత్‌షా. కేసీఆర్-మజ్లిస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న ఆయన.. రెండు కుటుంబాలు తప్ప టాలెంట్ ఉన్నవారే కనిపించడం లేదా అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com