Amit Shah : త్వరలో తెలంగాణకు అమిత్ షా

Amit Shah : త్వరలో తెలంగాణకు అమిత్ షా
X

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపే తానికి తీసు కోవాల్సిన చర్యలతోపాటు స్థానిక ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నిక వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేనున్నారు. వచ్చే నెల 18-20 తేదీలలో బెంగళూరులో బీజేపీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం తరువాతే కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏప్రిల్ నెల రెండోవారంలో నియామకం పూర్తికానున్నట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటు న్నాయి. కాగా.. తెలంగాణలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉత్సాహంగా పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని అమిత్ షా టీబీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

గురువారం పార్లమెంట్ భవనంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, కొత్తగా ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇతర తెలంగాణ సీనియర్ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో విజయం కోసం పాటించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సర్వే గురించి కూడా అమిత్ షా మాట్లాడారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మాత్రం అడ్డుకోవాలని టీ-బీజేపీ నేతలకు ఆయన సూచించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డా.కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story