Amrapali : ఆమ్రపాలికి ప్రమోషన్.. ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆమ్రపాలి కాటాకు కీలక పదవి దక్కింది. ఆమెకు కొన్ని బాధ్యతలను తగ్గించిన ప్రభుత్వం.. చివరికి కీలక స్థానాన్నే కట్టబెట్టింది. ఊహించినట్లుగానే ఆమెకు జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తిస్థాయి బాధ్యతలతో ప్రమోషన్ కల్పించింది.
ఆమ్రపాలి కాటా నుంచి రెండు డిపార్టుమెంట్ల అదనపు బాధ్యతల నుంచి తీసివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. ఆమెకు గతంలో అదనంగా ఉన్న హెచ్ఎండీఏ జాయింట్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్మెంట్ బాధ్యతలను తొలగించింది. ఇకమీదట ఆమె జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తి బాధ్యతల్లో కొనసాగనున్నారు.
తాజా బదిలీల్లో భాగంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా ఉన్న కోట శ్రీవాత్సవను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఛాహత్ బాజ్ పేయ్ ను, నారాయణపేట్ అదపు కలెక్టర్ గా ఉన్న మయాంక్ మిట్టల్ ను హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com