TG : పోలీస్ అక్క పేరుతో సిరిసిల్లలో వినూత్న కార్యక్రమం

విద్యార్థినులు, మహిళలకు అండగా నిలిచేలా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘పోలీస్ అక్క’ పేరిట ప్రతీ పీఎస్ నుంచి మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి మహిళల భద్రతకు సంబంధించిన విధులు కేటాయించారు. షీ టీమ్స్‌తో కలిసి వీరు పోక్సో, మహిళా చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై స్కూళ్లు, కాలేజీలకు తిరుగుతూ అవగాహన కల్పిస్తారు.
పోలీస్ అక్కగా ఉండే ఆ కానిస్టేబుల్ పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ పోక్సో, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ షీటీమ్‌కు సహాయంగా పని చేస్తారు. అత్యవసర సమయాల్లో డయల్ 100తోపాటు పోలీస్ అక్క ఫోన్ నంబరును సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆకతాయిల ఆట కట్టిస్తూ షీటీమ్ సత్ఫలితాలు సాధిస్తోందని, ఈ సంవత్సరం 52 మంది ఆకతాయిలను పట్టుకున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ కృష్ణ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com