TG High Court : యాంకర్ శిల్పా చక్రవర్తికి హైకోర్టులో ఊరట

ప్రముఖ యాంకర్, టీవీ నటి శిల్పా చక్రవర్తి భూ వివాదం లో చిక్కుకున్నారు. నల్గొండ జిల్లాలో తమకు చెందిన భూమి విషయం లో పోలీసులు వేధిస్తున్నారని హైకోర్టు ను ఆశ్రయించారు..దీనికి స్పందించిన హైకోర్టు భూ వివాదంలో పోలీసుల జోక్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలో 32 ఎకరాల భూమికి సంబంధించి నటి శిల్పా చక్రవర్తి కి మరో వ్యాపారవేత్త కి వివాదం నడుస్తోంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు శిల్ప చక్రవర్తి దంపతులు.టి. వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.., 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నుంచి పిటిషనర్లు ఈ భూమిని కొనుగోలు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ భూమిపై సివిల్ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఉత్తర్వులతో పాటు పోలీసు రక్షణ కూడా పొందారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
అయితే, స్థానిక ఎస్సై అమ్మిన వ్యక్తితో కుమ్మక్కై, వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ పిటిషనర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని న్యాయవాది ఆరోపించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పోలీసులను మందలించారు. సివిల్ కోర్టులో కేసు నడుస్తుండగా ఇంజక్షన్ ఉత్తర్వులు అమలులో ఉండగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై రామ్మూర్తి కి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేశారు.
అంతే కాకుండా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com