PV Narasimha Rao: పీవీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు నివాళులు

భారత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, దివంగత నేత పాములపర్తి వెంకట నరసింహారావుకి సీఎం చంద్రబాబు నివాళ్లు అర్పించారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘సంస్కరణలతో సంక్షోభ కాలాన్ని జయించి, దేశాన్ని ముందుకు నడిపించిన పాలనా సమర్థులు పీవీ నరసింహారావు. దేశ ప్రధానిగా ఆయన అమలు చేసిన సంస్కరణలు దేశ గతిని మార్చాయి’ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పీవీకి నివాళులు అర్పించారు.
ప్రధానిగా దేశ గతిని మార్చిన పీవీ
రాజీవ్ గాంధీ మరణానంతరం, కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు సామర్థ్యాన్ని గుర్తించి దేశ ప్రధానమంత్రిగా నియమించింది. తద్వారా దేశ చరిత్రలోనే మొదటిసారి గాంధీ, నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా ఒక తెలుగువాడు, దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పీవీ బాధ్యతలు చేపట్టక ముందు భారతదేశంలో ఒక రకమైన రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. అటువంటి పరిస్థితులలో ఐదు సంవత్సరాలు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. దీన్నిబట్టి పీవీ నరసింహారావు రాజకీయ చతురతను అర్థం చేసుకోవచ్చు.

© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com