చంద్రబాబు చుట్టూ తెలంగాణ రాజకీయాలు..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. నిజానికి చెప్పాలంటే నీళ్లల్లో నిప్పులు పుడుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ మంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను తెలంగాణ బిడ్డను అని, తాను నల్లమల్ల బిడ్డను, మొదట ఈ పాత్రం, ఆ తర్వాత నాయకుడు, ఆ తర్వాత పార్టీ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం తాను గతంలో పని పార్టీని, నాయకుడిని వదిలేసి, మళ్లీ కింద నుంచి పని చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వాడిని అని చెప్పుకొచ్చారు.
ఈ రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మట్టిమీద పుట్టాం, ఈ మట్టీ మీదే పోతామని, పోయే లోపు ఏదైనా చేయాలని తన తపన అని చెప్పారు. కావాలనే బీఆర్ఎస్ తనకు చంద్రబాబుతో సంబంధాలను ఆపాదిస్తూ విమర్శలు చేస్తుందని చెప్పారు. పాలమురు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (PRLIS) పై అధికార పార్టీ - BRS మధ్య తీవ్ర వాదనలు జరిగాయి.
ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. BRS తరుఫున మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీష్ రావ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు వాదనలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి అసెంబ్లీలో నెలకొన్న తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్ర ప్రకంపనలు రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాజకీయ ఘర్షణల మధ్య ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారుని చెప్పారు. నీటి శాఖ, వ్యవసాయ తీర్మానాలు సమయానికి రావడం, ప్రాజెక్ట్‌లు నిలిచిపోవడం వంటి సందర్భాలు సామాన్య ప్రజల దైనందిన జీవితంపై విశేషమైన ప్రభావాలు చూపుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్ర ప్రకంపనలు కొత్త సంచలనలకు తెరలేపుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

