Anganwadi : అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు

Anganwadi : అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు
X

తెలంగాణలో అధి కారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుటూ ముందుకు సాగుతోంది. అంగన్ వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాథమిక విద్య ను ప్రోత్సహించేందుకు 'అమ్మ మాట.. అంగన్వాడీ బాట' కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని సంకల్పించింది.

ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అంగన్ వాడీ టీచర్లకు విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా చిన్నారులకు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తారు. అంగన్వాడీ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందిస్తున్నారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇకపై పదవీ విరమణ పొందిన తర్వాత టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో జరిగిన 'అమ్మ మాట-అంగన్వాడీ బాట' కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.

పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్దితో పాటు క్రమశిక్షణ నేర్పిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిదేందుకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు సీతక్క. ఇకపై రిటైర్ మెంట్ తర్వాత టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష రూపాయలు బెనిఫిట్స్ కల్పిస్తామని అన్నారు.

Tags

Next Story