Online Game Suicide : ఆన్ లైన్ గేమ్‌కు మరో యువకుడు బలి

Online Game Suicide : ఆన్ లైన్ గేమ్‌కు మరో యువకుడు బలి
X

మరో యువకుడు ఆన్ లైన్ గేమ్ కు బలయ్యాడు. ఆటలో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పులు పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో జరిగింది. బూస కార్తీక్ కొంతకాలం నుంచి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. ఆట కోసం చేసిన అప్పులు పెరగడంతో కుటుంబ సభ్యులు మందలించారు. ఈ క్రమంలో గడ్డిమందు తాగి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags

Next Story