AP : కోనసీమ జిల్లాలో సర్పంచ్‌ల సంచలన నిర్ణయం

కోనసీమ జిల్లాలో సర్పంచ్‌లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డులను పలువురు సర్పంచ్‌లు తిరస్కరించారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా అవార్డులు, సన్మానాలను బహిష్కరించారు. గ్రామంలో ఏం అభివృద్ధి చేసామని అవార్డులు ఇస్తున్నారని ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికైన మాచవరం, పుల్లేటికుర్రు గ్రామ సర్పంచ్‌లు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని మండిపడ్డారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని ఆరోపించారు. ఉన్న నిధులను ప్రభుత్వం వాడుకుంటుంటే.. గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను ఎలా పరిష్కరించాలని సర్పంచ్‌లు ప్రశ్నించారు.
అనంతపురం జిల్లా నార్పలలో పోలీసుల ఆంక్షలు విధించారు. జగన్ సభకు వెళ్లిన వారు మధ్యలో వెళ్లిపోకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. జగనన్న వసతి దీవెన సభకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ అయిపోయే వరకు జనం బయటకు వెళ్లిపోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గత సభల్లో జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే జనం బయటకు పోవడంతో.. వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కఠిన ఆంక్షలు విధించి బలవంతంగా ప్రజలను కూర్చోబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల ఆంక్షలను జనం లెక్కచేయడం లేదు. పోలీసులు అడ్డుకుంటున్నా జనం ఆగడం లేదు. సింగనమల ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే.. జంప్ అయ్యేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. జగన్ మాట్లాడకుండానే సభా ప్రాగంణం ఖాళీ అవుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com