ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఘర్షణ..!

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఘర్షణ..!
X
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. ఏపీ అంబులెన్లను గద్వాల జిల్లా పుల్లూరు చెక్ పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఆంధ్రావాసులు ఆందోళనకు దిగారు.

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. ఏపీ అంబులెన్లను గద్వాల జిల్లా పుల్లూరు చెక్ పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఆంధ్రావాసులు ఆందోళనకు దిగారు. బీజేపీ నేతలతో కలిసి తెలంగాణ వాహనాలకు ఏపీలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. తెలంగాణలోకి తమను రానివ్వనప్పుడు ఏపీలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఏపీ భూభాగంలోకి వెళ్లి ఆందోళన చేసుకోండని తెలంగాణ పోలీసులు వారికి సూచించారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు. ఆసుపత్రి అనుమతి, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ-పాస్‌ ఉంటేనే పంపిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టుల వద్ద కరోనా రోగుల బంధువులు ఆందోళన చేపట్టారు.

Tags

Next Story