AP: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు షురూ

AP: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు షురూ
X
13 నగరాలు, 87 పట్టణాల్లో పునర్విభజన.. ఇప్పటికే ఆరంభమైన విభజన ప్రక్రియ... పెరగనున్న 736 డివిజన్లు, వార్డులు... ఓటర్ల జాబితాల ప్రచురణకు కసరత్తు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో పట్టణ రా­జ­కీ­యా­ల­కు మళ్లీ కద­లిక వచ్చిం­ది. ము­న్సి­ప­ల్ ఎన్ని­కల కోసం ప్ర­భు­త్వం వే­గం­గా ముం­ద­డు­గు వే­స్తుం­డ­గా, వా­ర్డుల పు­న­ర్వి­భ­జన ప్ర­క్రియ ప్రా­రం­భం కా­వ­డం రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో కొ­త్త ఉత్సా­హా­న్ని నిం­పిం­ది. ఎన్నో నె­ల­లు­గా ఎదు­రు­చూ­స్తు­న్న ఈ ఎన్ని­క­ల­కు సం­బం­ధిం­చి పరి­పా­ల­నా యం­త్రాం­గం పూ­ర్తి­స్థా­యి­లో సన్న­ద్ధ­మ­వు­తుం­డ­టం వి­శే­షం. రా­ష్ట్రం­లో­ని 87 ము­న్సి­పా­లి­టీ­లు, 13 నగ­ర­పా­లక సం­స్థ­ల్లో వా­ర్డు­లు, డి­వి­జ­న్ల పు­న­ర్వి­భ­జ­న­కు ప్ర­భు­త్వం అధి­కా­రి­కం­గా శ్రీ­కా­రం చు­ట్టిం­ది. ప్ర­స్తు­తం ఈ సం­స్థ­ల్లో కలి­పి 3,206 వా­ర్డు­లు, డి­వి­జ­న్లు ఉం­డ­గా, 2011 జనా­భా లె­క్కల ఆధా­రం­గా ఈ సం­ఖ్య­ను పెం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. పె­రు­గు­తు­న్న జనా­భా­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని సరి­హ­ద్దు­ల­ను తి­రి­గి ఖరా­రు చే­య­డం, ఓట­ర్ల సం­ఖ్య­ను సమ­తు­ల్యం చే­య­డం ప్ర­ధాన లక్ష్యం­గా అధి­కా­రు­లు పని చే­స్తు­న్నా­రు. ఈ ప్ర­క్రియ పూ­ర్త­యిన తర్వాత మొ­త్తం వా­ర్డుల సం­ఖ్య సు­మా­రు 3,942కు చేరే అవ­కా­శం ఉం­ద­ని అం­చ­నా. అంటే కొ­త్త­గా 736 వా­ర్డు­లు, డి­వి­జ­న్లు అం­దు­బా­టు­లో­కి రా­ను­న్నా­యి.

పునర్విభజన పూర్తికాగానే ఎన్నికలు

ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నిర్వహణకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వార్డుల హద్దులను ఖరారు చేసిన అనంతరం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. ఆ తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులు చేసి కలెక్టర్ ద్వారా తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్ని సంస్థల్లో కూడా త్వరలో పదవీకాలం ముగియనుంది. అయితే ఎన్నికలు ఇప్పుడే నిర్వహించినా, పాత పాలకవర్గాల గడువు పూర్తయ్యాకే కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతలు చేపడతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవడంతోనే రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. వార్డుల వారీగా సమీకరణాలు, స్థానిక సామాజిక వర్గాల ప్రాధాన్యత, ఓటర్ల అభిరుచులు వంటి అంశాలను విశ్లేషిస్తూ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలతో రాజకీయ కార్యకలాపాలు మరింత చురుకుగా మారాయి.

అయితే ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో గ్రామాలు, పంచాయతీలను పట్టణ సంస్థల్లో విలీనం చేసిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులు పరిష్కారమయ్యే వరకు ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. తుది తీర్పు వచ్చిన తర్వాతే ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు

కీలకంగా మారనున్న రిజర్వేషన్లు

రి­జ­ర్వే­ష­న్ల అంశం కూడా కీ­ల­కం­గా మా­ర­నుం­ది. బీ­సీల గణన కోసం ఏర్పా­టు చే­సిన డె­డి­కే­టె­డ్ కమి­ష­న్ త్వ­ర­లో ని­వే­దిక సమ­ర్పిం­చ­నుం­ది. ఈ ని­వే­దిక ఆధా­రం­గా వా­ర్డు­లు, డి­వి­జ­న్ల­కు రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­య­ను­న్నా­రు. అయి­తే మొ­త్తం రి­జ­ర్వే­ష­న్లు 50 శా­తా­న్ని మిం­చ­కూ­డ­ద­న్న సు­ప్రీం­కో­ర్టు ఆదే­శాల నే­ప­థ్యం­లో ప్ర­భు­త్వం తీ­సు­కు­నే ని­ర్ణ­యం ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. ఓట­ర్ల జా­బి­తాల తయా­రీ కూడా ఈ ప్ర­క్రి­య­లో ము­ఖ్య­మైన దశ. పు­న­ర్వి­భ­జన అనం­త­రం వా­ర్డుల వా­రీ­గా ఓట­ర్ల జా­బి­తా­ల­ను సి­ద్ధం చేసి, తుది ప్ర­చు­రణ చే­య­ను­న్నా­రు. ఓట­ర్ల సం­ఖ్య­ను బట్టి పో­లిం­గ్ కేం­ద్రాల సం­ఖ్య­ను ని­ర్ణ­యిం­చ­ను­న్నా­రు. ఇప్ప­టి­కే ఈ ప్ర­క్రి­య­కు సం­బం­ధిం­చి ఎన్ని­కల సంఘం పు­ర­పా­లక శా­ఖ­కు సూ­చ­న­లు జారీ చే­సిం­ది. అవ­స­ర­మైన సమయం ఇవ్వా­ల­ని శాఖ చే­సిన వి­జ్ఞ­ప్తి­ని ఎన్ని­కల సంఘం ఆమో­దిం­చి­న­ట్లు సమా­చా­రం.

Tags

Next Story