AP & TS: తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కల స్వైర విహారం

AP & TS: తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కల స్వైర విహారం
రోడ్లపై మందలుమందలుగా తిరు గుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఎక్కడిపడితే అక్కడ గాయాలు చేస్తూ పీక్కుతింటున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీలు, రోడ్లపై మందలుమందలుగా తిరు గుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఎక్కడిపడితే అక్కడ గాయాలు చేస్తూ పీక్కుతింటున్నాయి. దీంతో స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తమకు వీధికుక్కల బారి నుండి పరిష్కారం చూపడంటూ మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు.

అంబర్‌పేట ఘటన మరువకముందే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే వీధికుక్కలు పట్టుకునేందుకు ఆపరేషన్‌ డాగ్‌ చేపట్టామంటున్నారు అధికారులు. అయిన ఈ వీధికుక్కల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వీటి దాడులు కూడా రోజురోజుకు పెరుగుతున్నా యి. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఒక వీధికుక్క ఏకంగా తొమ్మిది మందిపై దాడి చేసిం ది. గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అటు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో దారుణం జరిగింది. పెద్దగోపతి గ్రామంలో ఇంటిఎదుట ఆడు కుంటున్న 16నెలల చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. చికిత్స నిమిత్తం సిద్దార్థ్‌ రావణ్‌ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సిద్దార్థ్‌ రావణ్‌ను పరామర్శించి.. బాధితకుటుంబానికి ఆర్థికసాయం అందించారు.

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. నజురుల్‌ నగర్‌ గ్రామంలోకి వచ్చిన దుప్పిలను వెంటాడాయి. దీంతో పరి గెత్తిన దుప్పిలు పొలాలకు వేసిన కంచెల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డాయి. విషయం తెలుసుకున్న అటవీఅధికారులు గాయపడ్డ దుప్పిలకు చికిత్స చేశారు.

ఇటు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రిపాలెం కాలనీలో పశువులపై పందులు దాడి చేశాయి. వాటి శరీరభాగాలను పీక్కుతిన్నాయి. దీంతో బయటతిరగడానికి చిన్నారులు, పెద్దలు భయపడుతున్నా రు. ఫిర్యాదు చేసిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అధికారులు తెలిపారు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారంలో గ్రామస్తులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. వీధికుక్క స్వైర విహారం చేసి ఐదుగురి వృద్దులపై దాడి చేసింది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన వృద్ధులు ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి తమకు వీధికుక్కల బెడద నుండి పరిష్కారం చూపాలన్నారు.


Tags

Next Story