Telangana High Court : హైకోర్టు సీజేగా అపరేశ్ కుమార్ సింగ్

Telangana High Court : హైకోర్టు సీజేగా అపరేశ్ కుమార్ సింగ్
X

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సుజప్పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని నిన్న కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పూర్తి కాలపు న్యాయమూర్తిగా అపరేశ్ కుమార్ సింగ్ వ్యవహరిచనున్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్ కుమా పన్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది. జార్ఖండ్ హైకోర్టు న్యాయమూ ర్తిగా ఉన్న జస్టిస్ రామచంద్రరావును త్రిపురకు బదిలీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూ ర్తిగా ఉన్న జస్టిస్ కేఆర్ శ్రీరాంను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేస్తూ భారత ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయ తీసుకుంది.

Tags

Next Story