TG : బీసీ గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలు దరఖాస్తు గడువు 6 వరకు పొడిగింపు

TG : బీసీ గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలు దరఖాస్తు గడువు 6 వరకు పొడిగింపు
X

మహాత్మాజ్యోతిబా పూలే (ఎంజేపీ) బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీ కొరకు ఆన్లైన్ దర ఖాస్తుల దాఖలుకు గడువును ఈ నెల 6 వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి, ఐఎఫ్ఎస్ అధికారి బడుగు సైదులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఖాళీగా ఉన్న మొత్తం బ్యాగ్ లాగ్ సీట్లు 683 భర్తీకి గానూ ఈ నెల 20 న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని, ఉదయం 10:00 గంటల నుండి మధ్యా హ్నం 12:00 గంటల వరకు జరుగుతుందని, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతోందని ఒక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతుల సీట్లను భర్తీ చేయ డానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 06-04-2025 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డబ్ల్యుడడ్యుడబ్ల్యు. ఎంజేపీటీబీ సీడబ్ల్యుఆర్ ఈఐఎస్ . గవ్. ఇన్ లేదా ఎంజేపీటీ బీసీ ఏడీ ఎంఐఎస్ఎస్ఎఎన్ ఎస్. ఓఆర్సీ వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Tags

Next Story