Rythu Bima Scheme : రైతు బీమాకు దరఖాస్తులు.. ఆగస్టు 5 వరకు గడువు

Rythu Bima Scheme : రైతు బీమాకు దరఖాస్తులు.. ఆగస్టు 5 వరకు గడువు
X

రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-59 ఏళ్ల వయసు ఉన్న వారు ఏఈవోలకు అప్లికేషన్లు ఇవ్వాలి. రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్, నామినీ ఆధార్‌కార్డు జత చేయాలి. జూన్ 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారూ అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది.

1965 ఆగస్టు 14వ తేదీ నుండి 2006 ఆగస్టు 14వ తేదీ మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకు అర్హులు.

ఆధార్ కార్డులో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

రైతు బీమా దరఖాస్తులతోపాటు గతంలో భీమా చేసుకున్న రైతుల బీమా లో మార్పులు చేర్పులు, ఆధార్ లేదా నామిని చనిపోతే మార్పులు జులై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలతో వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.

Tags

Next Story