Film Industry Leaders : సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవేనా?

సినీ ప్రముఖుల ముందు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలుస్తోంది. వీటిపై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.
1.సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.
2.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హీరో, హీరోయిన్ ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి.
3.కులగణన సర్వే ప్రచార కార్యక్రమాలకు సహకరించాలి.
తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com