Telangana Arjuna Award : తెలంగాణ బిడ్డకు అర్జున అవార్డు

అర్జున అవార్డుల్లో తెలంగాణ అమ్మాయి సత్తా చాటింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జువాంజీకి ఈ అరుదైన పురస్కారం దక్కింది. పారిస్ లో గతేడాది జరిగిన పారాలింపిక్స్ లో దీప్తి సత్తా చాటి కాంస్య పతకం దక్కించుకుంది. 400 మీటర్ల టీ 20 విభాగం ఫైనల్స్లో 55.82 సెకన్లలో రేస్ ను కంప్లీట్ చేసింది. పారాలిం పిక్స్లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్కు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన అథ్లెట్గా దీప్తి జువాంజి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ముందు జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో00ల మీటర్ల రేస్ ను 55.07 సెకన్ల లో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టిం చింది. బాల్యం నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి ఖమ్మం జిల్లా అథ్లెటిక్ మీట్లో కోచ్ నాగపూరి రమేష్ కంట్లో పడింది. దీప్తి అద్భుత టాలెంట్ను గుర్తించిన కోచ్ రమేష్.. ఆమెను హైదరాబాదికి తీసుకొచ్చారు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ట్రైయినింగ్ ఇప్పించారు. హైదరాబాద్లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచా నికి చూపించింది. విశ్వ క్రీడల్లో పతకం సాధించి దేశ జెండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన దీప్తిని కేంద్రం అర్జున అవార్డుతో సత్కరించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com