Covid Cases In Telangana: తెలంగాణకు కేంద్రం హెచ్చరిక.. కోవిడ్ కేసుల విషయంలో..

Covid Cases In Telangana: తెలంగాణకు కేంద్రం హెచ్చరిక.. కోవిడ్ కేసుల విషయంలో..
X
Covid Cases In Telangana: కరోనా కేసులు పెరుగుతుండడంపై తెలంగాణను హెచ్చరించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

Covid Cases In Telangana: కరోనా కేసులు పెరుగుతుండడంపై తెలంగాణను హెచ్చరించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. తెలంగాణలో గత రెండు వారాల్లో వారానికి సగటున నమోదయ్యే కొత్త కేసులు 287 నుంచి 375కు పెరిగాయి. జున్ మూడు నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో తెలంగాణ వాటా 1.78 శాతానికి చేరింది. గత వారం రోజుల్లో కేసుల పాజిటివిటీ రేటు 0.4 శాతం నుంచి 0.5 శాతానికి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌..తెలంగాణ వైద్య ఆరోగ్య కార్యదర్శికి లేఖ రాశారు.

దేశవ్యాప్తంగా గత మూడు నెలల్లో కేసులు తగ్గి.. వారం రోజులుగా పెరుగుతన్నట్లు గుర్తు చేశారు. తక్షణం కట్టడి చర్యలు ప్రారంభించాలని సూచించారు. టెస్ట్,ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయో దాన్ని క్లస్టర్‌గా గుర్తించి పర్యవేక్షించాలని గైడ్‌ లైన్స్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు.

Tags

Next Story