TG : 23 నుంచి అసెంబ్లీ.. 25న తెలంగాణ బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ సమావేశం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను గవర్నర్ జారీ చేశారు. మొదటి రోజున అసెంబ్లీలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉంటుంది. ఈ నెల 25 లేదా 26న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈనెల 23న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించిబడ్జెట్కు తుదిరూపం ఇవ్వనున్నారు. ఈనెల 25న అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వనుంది. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
నాలుగు నెలల కోసం ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఆమోదించిన రూ.2.75 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పుడు పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com