TG : ఆటం బాంబు పేలబోతోంది.. మంత్రి పొంగులేటి మరో సంచలనం

TG : ఆటం బాంబు పేలబోతోంది.. మంత్రి పొంగులేటి మరో సంచలనం
X

తెలంగాణలో మరో పెను సంచలనం చోటు చేసుకోబోతోందా ? ఈ ఊహాగానాలకు మరింత ఊపందిస్తూ మంత్రి పొంగుటేటి శ్రీనివాస్‌రెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటు బాంబు.. లక్ష్మీ బాంబు కాదు.. త్వరలో ఆటమ్‌ బాంబ్ పేలబోతోందంటూ కామెంట్ చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. తప్పు చేయకపోతే ఉలికి పాటు ఎందుకు అని ప్రశ్నించారు. 55 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో బయటపెడతామని పొంగులేటి తేల్చి చెప్పారు. మంత్రి పొంగులేటి దేని గురించి మాట్లాడారన్న చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్రంలో మరో రాజకీయ సంచలనం తప్పదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story