Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు అవార్డు

Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు అవార్డు
X

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయం ఈ అవార్డుకు ఎంపికైంది. 2024కు గానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులకు రాకపోకలు అందించి బెస్ట్ విమానాశ్రయంగా నిలిచింది. విమానాశ్రయ పరిణామం, సిబ్బంది తీరు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.ఈ అవార్డు హైదరాబాద్ విమానాశ్రయానికి మాత్రమే కాకుండా, భారతదేశ విమానయాన రంగానికి గర్వకారణంగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిరంతరం కృషి చేస్తోంది. భవిష్యత్తులో మరింత ఆధునిక సదుపాయాలు, స్మార్ట్ టెక్నాలజీ పరిజ్ఞానం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుందని అంచనా వేయవచ్చు.

Tags

Next Story