Janagam District : చెట్ల పొదల్లో పసికందు.. జనగామ జిల్లాలో అమానుషం

తల్లిదండ్రులు చేసిన పాపాలకు బిడ్డలు రోడ్డుపాలువుతున్నారు. కష్టాలు ఉన్నప్పుడు బిడ్డలను కనాల్సిన అవసరం లేదు. లేకపోతే పడకసుఖం కోసం బిడ్డలను కంటున్నవారు లేకపోలేదు. అలా ఈ భూమిపైకి వచ్చిన బిడ్డను చెట్ల పొద్దల్లో విసిరేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో స్థానికులు వెంటనే అటువైపు వెళ్లారు. రోడ్డు పక్కన వదిలేసి ఉన్న ఆ బిడ్డను చూసి చలించిపోయారు. ఒక వృద్ధురాలు ఆ చిన్నారిని చేరదీసి, స్నానం చేయించి సంరక్షించింది.
ఎంత వెతికినా చుట్టుపక్కల ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరూ కనిపించలేదు. పసిబిడ్డను కావాలనే వదిలేసి వెళ్లారని అనుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసికందును వదిలి వెళ్లిన తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com