KTR : తెలంగాణ ఏటీఎం నుంచి డబ్బు సంచులు బోర్డర్ దాటుతున్నాయి

KTR : తెలంగాణ ఏటీఎం నుంచి డబ్బు సంచులు బోర్డర్ దాటుతున్నాయి
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు డబ్బు సంచులు పంపుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందన్నారు. హర్యానా ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచే డబ్బులు వెళ్లాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు తెలంగాణలో వసూల్ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ డబ్బులు వెళుతున్నాయని కేటీఆర్ తన ట్వీట్ లో ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వస్తున్నాయంటూ శివసేన లీడర్ మాట్లాడిన మాటలను సంబంధించిన వార్తను తన పోస్టుకు కేటీఆర్ జత చేశారు. తెలంగాణ, కర్ణాటక నుంచి మహారాష్ట్రకు ఉన్న బార్డర్ ను క్లోజ్ చేయాలని శివసేన నేత డిమాండ్ చేసినట్లుగా కేటీఆర్ చెప్పారు. అటు ఇటీవలే ప్రధాని మోడీ కూడా రేవంత్ ప్రభుత్వ తీరుపై చేసిన బహిరంగ విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Tags

Next Story